prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 12:56 pm Digital Edition : PRAJA KSHETRAM

మొయినాబాద్‌ ఎంపీడీవోగా హిమబిందు

మొయినాబాద్‌ ఎంపీడీవోగా హిమబిందు

మొయినాబాద్‌, జూన్ 01(ప్రజాక్షేత్రం): మొయినాబాద్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా నూతనంగా నియమితులైన హిమబిందు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆమెకు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ పారదర్శకంగా చేరవేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.