వర్షాకాలంలో వంతెన ప్రయాణం ప్రమాదకరం
-ఆర్లి (కే) వంతెన మరమ్మతులకు గ్రామస్తుల విజ్ఞప్తి నిర్మల్ జిల్లా ప్రతినిధి జూన్ 13(ప్రజాక్షేత్రం):లోకేశ్వరం మండలంలోని ఆర్లి (కే) గ్రామ సమీపంలోని వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఏర్పడటంతో పాటు నిర్మాణం బలహీనపడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే వంతెన మరింత దెబ్బతిని ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని...