prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 6:32 pm Digital Edition : PRAJA KSHETRAM

శంకర్ పల్లి మున్సిపల్ ల్లో కాంగ్రెస్ నాయకుల కబ్జాల పర్వం

శంకర్ పల్లి మున్సిపల్ ల్లో కాంగ్రెస్ నాయకుల కబ్జాల పర్వం

  • గొల్లవాగులో అక్రమ నిర్మాణం..అధికారుల ఆశీస్సులేనా…?

శంకర్ పల్లి జూన్ 09(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న గొల్లవాగు నేడు ఆక్రమణదారుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందా…? పట్టణ నడిబొడ్డున వాగు పరిధిలోనే నిర్మాణాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారునే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాధారణ పౌరుడు ఇంటి ముందు చిన్న షెడ్ వేసినా నిబంధనల పేరుతో నోటీసులు ఇచ్చే అధికారులు, వాగులోనే భారీ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు..? ఈ నిర్మాణాలు అధికారుల కళ్లకు కనిపించడం లేదా..? లేక కనిపించినా చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుంటున్నారా..? వాగులు, చెరువులు వంటి జలవనరులు ప్రజల ఆస్తి భవిష్యత్ తరాలకు అందించాల్సిన సహజ సంపద. అలాంటి వాగును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుంటే వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులదే… కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఆక్రమణదారుల ధైర్యం వెనుక ఎవరి అండ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంటే వెంటనే కూల్చివేత చర్యలు ఎందుకు చేపట్టడం లేదు. అనుమతులు ఉంటే వాటి వివరాలను ప్రజలకు వెల్లడించగలరా.. వాగు ఎఫ్‌టీఎల్ పరిమితుల్లో ఈ నిర్మాణం ఉందా లేదా అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారా..? లేక కొందరి ప్రయోజనాల కోసం నిబంధనలను పక్కన పెడుతున్నారా..? అనే సందేహాలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. గొల్లవాగులో జరుగుతున్న నిర్మాణాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శంకర్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్, బీఆర్ఎస్ సీనియర్ నేత వాసుదేవ్ కన్నా డిమాండ్ చేస్తున్నారు.