సీఎం సభకు బస్సులు భైంసా బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

సీఎం సభకు బస్సులు భైంసా బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు నిర్మల్ జిల్లా జూన్ 01(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి సభకు ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున తరలించడంతో భైంసా బస్టాండ్‌లో సోమవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం సంత కావడంతో మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో భైంసాకు తరలివచ్చారు. అయితే బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంత పనుల కోసం వచ్చిన రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు...