prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 5:07 pm Digital Edition : PRAJA KSHETRAM

హోటళ్లకు కుళ్ళిన చికెన్, ఆటోను అడ్డుకున్న స్థానికులు.

హోటళ్లకు కుళ్ళిన చికెన్, ఆటోను అడ్డుకున్న స్థానికులు.

  • షాద్ నగర్ లో కొన్ని హోటల్ నిర్వాహకుల అడ్డగోలు వ్యవహారం..

షాద్ నగర్ జూన్ 29(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ నుండి ఆటోలో చికెను ను తరలిస్తుండగా స్థానిక వ్యాపారులు పట్టుకుని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ఆటోలో ఉన్న మాంసాన్ని పరిశీలించగా…. అనారోగ్యం తో చనిపోయిన, డ్యామేజ్ అయిన కోళ్ల మాంసం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన పై మున్సిపల్ కమిషనర్ సునీత స్పందిస్తూ ఆటోను సీజ్ చేశారు. ఇలాంటి కుళ్ళిన మాంసం కొనుగోలు చేస్తున్న హోటల్స్ పై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.