త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ..

త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలంగాణ నుంచి ఆ ఇద్దరికి కేబినెట్ బెర్తులు? హైదరాబాద్ జూన్ 25(ప్రజాక్షేత్రం):త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దేశవ్యాప్తంగా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను సమన్వయం చేస్తూ ప్రధాని మోదీ తన మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీల మధ్య మంత్రి పదవుల కోసం పోటీ ఒక్కసారిగా ఊపందుకుంది. మరో రెండు, మూడు రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోందన్న వార్తలతో ఆశావహులైన ఎంపీలు హుటాహుటిన ఢిల్లీ...