prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 2:32 am Digital Edition : mohan.sabbasani@gmail.com

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని వ్యక్తి దుర్మరణం

బెస్టవారిపేట, జూలై 12(ప్రజాక్షేత్రం):మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న కంభం–బెస్తవారిపేట ప్రధాన రహదారిపై కారులో ప్రయాణిస్తున్న చెట్టిచెర్ల గ్రామానికి చెందిన గురుమూర్తి అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గురుమూర్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.