అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని వ్యక్తి దుర్మరణం
బెస్టవారిపేట, జూలై 12(ప్రజాక్షేత్రం):మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న కంభం–బెస్తవారిపేట ప్రధాన రహదారిపై కారులో ప్రయాణిస్తున్న చెట్టిచెర్ల గ్రామానికి చెందిన గురుమూర్తి అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గురుమూర్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ...