prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 10:32 am Digital Edition : PRAJA KSHETRAM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త ఆశలు

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త ఆశలు

  • గొట్లపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన -డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్
  • ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
  • పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

పెద్దేముల్, జులై 06(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామానికి చెందిన బంటు వాణిశ్రీ–కిష్టప్ప దంపతులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్ మహమ్మద్ సలాం, స్థానిక నాయకులతో కలిసి నూతన గృహాన్ని ప్రారంభించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలు శాశ్వత నివాసాన్ని పొందుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాయని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, గృహ భద్రత ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, నర్సింహులు, తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ-బ్లాక్ అధ్యక్షుడు లొంక నర్సింహులు, గొట్లపల్లి గ్రామ సర్పంచ్ మహమ్మద్ సలాం, ఉపసర్పంచ్ చంద్రప్ప, స్థానిక సీనియర్ నాయకులు గోరె పటేల్, చాంద్ పాషా, మహమ్మద్ రఫీక్, అంతప్ప, నర్సప్ప, భీమ్ రెడ్డి, అంజిలప్ప, రవి, శ్రీను, రామ్ రెడ్డి, మహమూద్ అలీ, అనిల్ రెడ్డి, యాదప్ప గౌడ్‌తో పాటు గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.