ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ
- రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత.
- సోదాల్లో రూ.32 లక్షలు స్వాధీనం.
పెద్దపల్లి ,జూలై 14 (ప్రజాక్షేత్రం):పెద్దపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనుల బిల్లులు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుంచి రూ.4.50 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తొలి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.