ఓఆర్‌ఆర్ వద్ద పోలీసుల కాల్పులు
ఓఆర్‌ఆర్ వద్ద పోలీసుల కాల్పులు పోలీసులపై కత్తితో దాడి యత్నం.. ఆత్మరక్షణలో కాల్పులు, నిందితుడికి గాయాలు హైదరాబాద్ జులై 02(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) సమీపంలో పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. నల్గొండ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు భూష్మి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నల్గొండ సీసీఎస్ పోలీసులు అందిన సమాచారం మేరకు ఆదిభట్ల సమీపంలోని ఓఆర్‌ఆర్ వద్ద...