కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం కరీంనగర్, జులై 01(ప్రజాక్షేత్రం):నగరంలోని ఆర్టీసీ-2 డిపోలో నిలిపి ఉంచిన ఓ ఎలక్ట్రిక్ బస్సులో బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనతో డిపోలో ఒక్కసారిగా కలకలం నెలకొంది. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పక్కనే నిలిపి ఉన్న ఇతర బస్సులకు మంటలు వ్యాపించకుండా నిలువరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి...