కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసే సత్తా ఉన్న ప్రభుత్వం
- తాండూరు ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి మంచి కమిట్ మెంట్ ఉన్న నాయకుడు
- రూ.290 కోట్ల రూపాయలతో హ్యామ్ రహాదారి అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
- శంఖుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,తదితరులు
- తాండూరు నియోజకవర్గ రోడ్లకు అత్యధిక నిధులు మంజూరు చేశాం-మంత్రులు
- 11 వేల కోట్ల రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు, 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
- ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి అభివృద్ధి పనులు మంజూరు చేయించడంలో పట్టువదలని విక్రమార్కుడు
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,రోడ్డు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- తాండూరును అభివృద్ధి చేయడమే నా లక్ష్యం-తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహార్ రెడ్డి
పెద్దేముల్, జులై 18 (ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సత్తా ఉన్న ప్రభుత్వమని, ప్రజలకు చెప్పింది చేసి చూపించే ప్రభుత్వమని, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహార్ రెడ్డి చొరవతో వందల కోట్ల రూపాయల నిధులతో తాండూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలోని అంతారం గ్రామ పరిధిలో రూ.290 కోట్ల విలువైన హ్యామ్ రహాదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవేళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహార్ రెడ్డి, చేవేళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారిలతో కలిసి శంఖుస్థాపన చేశారు.అనంతరం కందనెల్లి జీపీఆర్ గార్డెన్లో నిర్వహించిన “ప్రగతి సభ” లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ…..
ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, రూ.290 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారులు నిర్మించేందుకు శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. రవాణా వ్యవస్థను అభివృద్ధి పరుస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.కాగ్నా నదిలో తాండూరు మురుగు నీరు కలువకుండా రూ.30 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు. తాండూరులో 571 మంది అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్లు కేటాయించామని, రాష్ట్రంలో 11 వేల కోట్ల రూపాయాలతో రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి సుమారు 70 వేల మందికి రెండున్నర ఏండ్లలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, సత్తా ఉన్న ప్రభుత్వమని, చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. తాండూరు ప్రజలు కమిట్మెంట్తో పనిచేసే ఎమ్మెల్యే మనోహార్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..తాండూరు నియోజకవర్గానికి రోడ్ల కోసం రూ.290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. మంజూరు చేసిన నిధులతో వెంటనే పనులు చేపడతామని అన్నారు. ప్రజా పాలనలో 30 మాసాల్లో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షలు, 500 లకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందన్నారు. రైతు భరోసా కిందా 9 రోజుల్లో రూ.900 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశామని అన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటేడ్ పాఠశాలలు మంజూరు చేశామని, కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే రూ.94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ….ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను దశలవారీగా అమలు పరుస్తుందని, వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి రూ. 700 వందల కోట్ల నుండి రూ.800 వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే అందులో తాండూరు నియోజకవర్గానికి సుమారు రూ.345 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహార్ రెడ్డి మాట్లాడుతూ……తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకురావడం జరిగిందని, సీఆర్ఆర్ కిందా రూ.100 కోట్ల రూపాయలతో ప్రధాన రోడ్లు,గ్రామాలకు అనుసంధాన రోడ్లు, పెద్దేముల్ మండలానికి రూ.30 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఒక సంవత్సర కాలంలో తాండూరులో అన్ని రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఒక కమిట్మెంట్ తో పనిచేస్తూ ముందుకు పోతున్నామన్నారు. కోట్ పల్లి ప్రాజెక్టుకు రూ.90 కోట్లు మంజూరు చేయించి 14 గ్రామాలకు 9,400 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చెప్పింది చేసుకొంటూ ముందుకు పోతున్నామన్నారు. యాలాల మండలం దౌలాపూర్లో రూ.200 కోట్ల ఇంటిగ్రేటేడ్ స్కూల్, జుంటుపల్లి ప్రాజెక్టుకు నిధులు, తాండూరులో రూ.75 కోట్ల రూపాయలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్,బషీరాబాద్లో 30 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టి తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో గత సర్పంచ్ ఎన్నికల్లో ఉన్న 155 గ్రామ పంచాయతీలో 120 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ సర్పంచులు గెలుపొందారని, 26 స్థానాల్లో ఏకగ్రీవం కావడం జరిగిందన్నారు. దీంతో మరింత బాధ్యత తనపై పెరిగిందని అన్నారు.బైపాస్ రోడ్డు భూనిర్వాసితులకు రూ.25 కోట్ల 18 లక్షలు చెక్కులను కూడా ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, చేవేళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి,ఎస్పీ స్నేహా మెహ్రా, అదనపు కలెక్టర్లు ఉమాశంకర ప్రసాద్, వెంకట చారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డీఓ అనిత, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు నియోజకవర్గం సర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు,పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి,తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మెన్ అబ్దుల్ రజాక్, కందనెల్లి సర్పంచ్ భూమే యాదమ్మ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు ఆనంద్ నాయక్, మండల తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్, ఎంపీడీఓ తిరుమల స్వామి, ఎంపీఓ రతన సింగ్,ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ చైర్మెన్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

