‘గోవింద’ నామస్మరణతో మారుమోగిన వెంకులోని గుట్ట
'గోవింద' నామస్మరణతో మారుమోగిన వెంకులోని గుట్ట కీసర, జూలై 25(ప్రజా క్షేత్రం): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలోని వెంకులోని గుట్టపై వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం అంతా "గోవింద... గోవింద..." నామస్మరణతో మారుమోగింది....