జర్నలిస్టుల హామీలు వెంటనే అమలు చేయాలి
మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం మేడ్చల్-మల్కాజిగిరి, జూలై 13(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన సంక్షేమ హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.కె. సలీం, గుమ్మడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బనావత్...