తొలి ఏకాదశి వేళ భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు
తొలి ఏకాదశి వేళ భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు తొలి ఏకాదశి సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని యమనంపేట గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ దేవాలయాల్లో భజనలు, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామివారి దర్శనంతో తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.