నిద్రిస్తున్న మహిళలే లక్ష్యం.. సీరియల్ దొంగ అరెస్ట్
రూ.10 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం మార్కాపురం, జూలై 10(ప్రజాక్షేత్రం):జిల్లాలో మహిళల మెడలో బంగారు గొలుసులు అపహరించడం, తాళం వేసిన దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న సీరియల్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 83 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. బేస్తవారిపేట మండలం పాపాయపల్లి గ్రామంలో ఇంటి వద్ద నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించిన ఘటనతో పాటు, ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు, పూరిమెట్ల గ్రామాల్లో దోమతెరల్లో...