పారిశుద్ధ్యం, పచ్చదనంపై ఎంఎంసీ ఫోకస్
పారిశుద్ధ్యం, పచ్చదనంపై ఎంఎంసీ ఫోకస్ ★ నాగార్జున నగర్‌లో ఎంఎంసీ కమిషనర్ తనిఖీ కాప్రా, జూలై 21(ప్రజా క్షేత్రం): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి నాగార్జున నగర్ కాలనీలో సోమవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, అర్బన్ బయోడైవర్సిటీ, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి రహదారులు, పారిశుద్ధ్యం, పచ్చదనం, ఆక్రమణలు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు.రోడ్ల వెంట ఖాళీగా ఉన్న ప్లాంటర్ బాక్స్‌లలో వెంటనే మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి...