పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్
కుషాయిగూడలో అదృశ్యం కేసు మిస్టరీ వీడింది బాలికల వాంగ్మూలంతో వెలుగులోకి పోక్సో కేసు కుషాయిగూడ, జూలై 11(ప్రజాక్షేత్రం):మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఇద్దరు బాలికల అదృశ్యం కేసు దర్యాప్తులో పోక్సో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అజయ్ ఉప్పాల (24)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 1న రాత్రి ఫిర్యాదుదారురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమార్తె ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉదయం కళాశాలకు...