ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం
ఆర్టీసీ 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం రేపు కుషాయిగూడ, జూలై 13(ప్రజా క్షేత్రం): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో జూలై 14న 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో కుషాయిగూడతో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఆర్టీసీ సేవలకు సంబంధించిన సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే...