బాకారం జాగీర్‌లో ఓటర్ల జాబితా గందరగోళం.
బాకారం జాగీర్‌లో ఓటర్ల జాబితా గందరగోళం. ఒకే ఇంటి నెంబర్‌పై 79 ఓట్లు! మొయినాబాద్, జులై 16(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని బాకారం జాగీర్‌లో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న తీవ్ర అవకతవకలు స్థానికంగా పెను కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియకు గొడ్డలిపెట్టుగా మారిన ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాకారం జాగీర్ పరిధిలోని ఇంటి నెంబర్ 5-1 పై ఏకంగా 79 ఓట్లు నమోదు కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో సదరు ఇంట్లో నివసించే వారి సంఖ్యకు, ఓటర్ల జాబితాలో ఉన్న సంఖ్యకు...