రహదారా మురికి కాలువనా కుబీర్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యపు పరాకాష్ట!

రహదారా మురికి కాలువనా కుబీర్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యపు పరాకాష్ట! నిర్మల్ జిల్లా జూలై 24(ప్రజాక్షేత్రం):కుబీర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి చెరువును తలపిస్తున్నా. అధికారులు కళ్లున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది.రహదారిపై మురుగు కాలువలుప్రధాన కూడలి గుంతలమయమై, బురద నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. పాదచారులు కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది....