రానున్న 3 రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు..
రానున్న 3 రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. హైదరాబాద్ జులై 26(ప్రజాక్షేత్రం):బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. రాగల రెండు మూడ్రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి,...