రూ.10 నాణేలతో రూ.1 లక్షా10 బైక్ కొనుగోలు చేసిన యువకుడు
యాదాద్రి భువనగిరి జులై 08(ప్రజాక్షేత్రం):జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. తాను కొనుగోలు చేసిన నూతన ద్విచక్ర వాహనానికి సంబంధించిన పూర్తి నగదును ఓ వ్యక్తి పది రూపాయల నాణేల రూపంలో చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిట్యాల మండల కేంద్రంలో ఈ వినూత్న ఘటన వెలుగుచూసింది. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండ రఘుపతి అనే వ్యక్తి, స్థానిక శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కొనుగోలు చేశాడు. వాహనం ధర సుమారు రూ.1.10 లక్షలు కాగా, ఈ...