రూ 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భూగర్భ జలశాఖ అధికారులు
- సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడి
సూర్యాపేట జులై 15(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖ కార్యాలయంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించి ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు బోరు రిగ్గింగ్ అనుమతి మంజూరు చేసేందుకు దరఖాస్తుదారుడి నుంచి రూ 20 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో జిల్లా భూగర్భ జల అధికారి మెగావత్ బాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ కొసరాజు వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం మేరకు ముందుగా అందిన ఫిర్యాదును పరిశీలించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని లంచం స్వీకరిస్తున్న సమయంలో దాడి నిర్వహించి నిందితులను పట్టుకున్నారు అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకుని అవసరమైన ఆధారాలను సేకరించారు అధికారులు నిందితులను ప్రశ్నిస్తూ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు నిందితులను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారగా ప్రభుత్వ సేవల్లో పారదర్శకత కోసం ప్రజలు లంచాలు డిమాండ్ చేసిన అధికారులపై వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు కేసు దర్యాప్తు కొనసాగుతోంది.