prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 10:06 am Digital Edition : mohan.sabbasani@gmail.com

రూ.66 లక్షలతో నాలుగు సీసీ రోడ్లకు శంకుస్థాపన

గిద్దలూరు, జూలై 13(ప్రజాక్షేత్రం):గిద్దలూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా 2వ వార్డు ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీనివాసనగర్‌లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న నాలుగు నూతన సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పనులను ప్రారంభించి మాట్లాడిన ఆయన, పట్టణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.