రూ.66 లక్షలతో నాలుగు సీసీ రోడ్లకు శంకుస్థాపన
గిద్దలూరు, జూలై 13(ప్రజాక్షేత్రం):గిద్దలూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా 2వ వార్డు ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీనివాసనగర్‌లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న నాలుగు నూతన సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పనులను ప్రారంభించి మాట్లాడిన ఆయన, పట్టణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి అభివృద్ధి...