prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 3:03 am Digital Edition : PRAJA KSHETRAM

లయన్స్ చార్టర్ డే.. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

లయన్స్ చార్టర్ డే.. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

ఉప్పల్, జూలై 1(ప్రజా క్షేత్రం): ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడలో లయన్స్ జిల్లా 324 హెచ్ చార్టర్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కుషాయిగూడ ఆధ్వర్యంలో సౌత్ కమలనగర్ ప్రభుత్వ ఎంపీయూపీ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం సంతోషంగా ఉందని, సమాజ సేవే ధ్యేయంగా విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ లయన్స్ ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ కొత్త రామారావు, జిల్లా కార్యదర్శి (గ్లోబల్ కాజెస్) కొత్తపల్లి రాంబాబు, క్లబ్ అధ్యక్షుడు తారకేశ్వరరావు, కార్యదర్శి చి. వెంకట రామరాజు, కోశాధికారి మోహన్, సభ్యులు చంద్రశేఖర్, రవిశంకర్ రాజు, పెద్ది శ్రీనివాస్, అంజనీ కుమార్, శ్రావణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన వైఆర్‌పీ ఫౌండేషన్ చైర్మన్ రవి ప్రసాద్‌కు, సహకరించిన మాజీ జిల్లా గవర్నర్ గంప నాగేశ్వరరావుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.