వరకట్నం వేధింపుల కేసు కొట్టివేత
భద్రాచలం, జూలై 25(ప్రజాక్షేత్రం):చర్ల మండలం, చర్ల గ్రామంలో 2014సం.లో దోమల రాజశేఖర్ మరియు అతని కుటుంబ సభ్యులపై రాజశేఖర్ భార్య అయిన దోమల శారద చర్ల పోలీస్ స్టేషన్ లో పెట్టిన 498-A కేసును భద్రాచలం అదనపు జ్యూడిషియల్ ప్రధమశ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎ. దుర్గాభవాని కొట్టివేసారు. కేసు నేపథ్యం: 2014 సం.లో చర్ల గ్రామస్తుడు దోమల రాజశేఖర్ మరియు అతని కుటుంబ సభ్యులపై రాజశేఖర్ భార్య శారద చర్ల పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేధింపుల కేసు (498-A) పెట్టారు. చర్ల పోలీసులు...