‘వెనిజులా విప్లవ వేగుచుక్క’హ్యూగో చావెజ్

'వెనిజులా విప్లవ వేగుచుక్క'హ్యూగో చావెజ్ లాటిన్ అమెరికాలో సైమన్ బొలివర్, ఫెడల్ కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ స్ఫూర్తిని రగిలించిన విప్లవ వీరుడు హ్యూగో చావెజ్. ఆయన అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అడుగడుగున ప్రతిఘటించి విప్లవ చోదక శక్తిగా ప్రభవించి ప్రత్యామ్నాయ సారధిగా పరిణమించి వెనిజులాలో నయా వలసవాద రాజకీయాలను అంతమొందించి ప్రపంచానికి ప్రత్యామ్నాయ మార్గదర్శనం చేశారు. సైనిక తిరుగుబాటుతో వెలుగులోకి ప్రసరించిననూ క్రమంగా ఆయన ప్రజాస్వామిక పంథాని అనుసరించి వెనిజులాలో సోషలిస్టు పాలనకు మార్గాన్ని సుగమం చేసి సరికొత్త చరిత్రను సృష్టించారు. సామాన్య మధ్య...