ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి
ఘట్కేసర్, జూలై 10(ప్రజాక్షేత్రం):మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ డివిజన్ వేమన నగర్ కాలనీలో శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ విజయ వెంకటేశ్వరస్వామివారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలు, హోమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితో పాటు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.