prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 6:32 pm Digital Edition : PRAJA KSHETRAM

శంకర్ పల్లి నుండి మైతప్ ఖాన్ గూడ వరకు మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

శంకర్ పల్లి నుండి మైతప్ ఖాన్ గూడ వరకు మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

  • బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా …
  • అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని రాకపోకలు కొనసాగిస్తున్న వాహనదారులు.
  • పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని ప్రభుత్వ యంత్రాగం

శంకర్ పల్లి జులై 26(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి నుండి మైతప్ ఖాన్ గూడ వరకు రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్నో సార్లు అధికారులకు విన్నవించినా చేసిన, పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉంది. అని ఆదివారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న లక్ష్మారెడ్డి గూడెం గేట్ దగ్గర నిరసన తెలిపారు. ప్రభుత్వాలు, పాలకులు మారిన గ్రామాల మెయిన్ రోడ్డుల స్థితిగతులు మారడం లేదు అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మెయిన్ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వివిధ గ్రామాల ప్రజలు, వాహన దారులు, తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రాకపోకలు కొనసాగిస్తున్నారు. అత్యవసరం సమయంలో 108 అంబులెన్స్ సైతం రాలేని దుస్థితి సరైన రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఏండ్లుగా ప్రజలు, రైతులు, ఇబ్బంది పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు అన్ని మాజీ ఎంపీపీ ధర్మాన్న గారి గోవర్దన్ రెడ్డి, మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి అన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిన ప్రధాన రహదారులను పట్టించుకోకపోవడం పై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసారు. త్వరిత గతిన స్పందించి ప్రధాన రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని, వాహనదారులు ప్రమాదవశాత్తు ఇబ్బందులు ఎదురైతే అధికార పార్టీ ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. ఈ ప్రధాన రోడ్డు మార్గాన మూడు జిల్లాల అయిన వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల ప్రజలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిరసన కార్యక్రమంలో మహాలింగాపురం సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, మాణిక్యం రెడ్డి, మాజీ ఎంపీటీసీ భవాని యాదగిరి, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు కొంగర మల్లేశం, నరేందర్ రెడ్డి, బొడ వెంకటయ్య, బుచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్, నారాయణ, నర్సింలు. తదితరులు పాల్గొన్నారు.