షాబాద్‌కు వెళ్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్

శంకర్ పల్లి జులై 11(ప్రజాక్షేత్రం):షాబాద్‌లో హత్యకు గురైన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు శనివారం అడ్డుకొని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులను మార్గమధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాధిత కుటుంబాలను పరామర్శించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.