సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు!
తెలంగాణ బ్యూరో జులై 08(ప్రజాక్షేత్రం):మన శరీరానికి నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడే కీలక ఆధారం కూడా. రోజూ సరిపడా, నాణ్యమైన నిద్ర లేకపోతే గుండెపై అదనపు భారం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సమయంలో శరీరం తనను తాను పునరుద్ధరించుకోవడంతో పాటు హార్మోన్ల సమతుల్యం, రక్తపోటు నియంత్రణ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం వంటి కీలక ప్రక్రియలు జరుగుతాయి. ఈ విశ్రాంతి దశ తగ్గిపోతే గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు....