స్కూల్ బస్సును ఢీకొన్న రైలు..ఐదుగురు మృతి

స్కూల్ బస్సును ఢీకొన్న రైలు..ఐదుగురు మృతి పశ్చిమ బెంగాల్‌ జులై 17(ప్రజాక్షేత్రం):పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ముర్షిదాబాద్‌లో స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు విద్యార్థులున్నారు. మరికొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సు పెద్ద మొత్తంలో ధ్వంసం అయిపోయింది....