ప్రముఖ ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న కన్నుమూత
ప్రముఖ ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న కన్నుమూత ఖమ్మం, జూలై 03(ప్రజాక్షేత్రం):విప్లవ గీతాలతో, ప్రజా చైతన్య ఆటపాటలతో ఐదు దశాబ్దాల పాటు పీడిత ప్రజల పక్షాన నిలిచిన ప్రముఖ ప్రజా గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అరుణోదయ నాగన్న (65) శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ స్ట్రోక్, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల ప్రస్థానం ఖమ్మం జిల్లా రాజారాం గ్రామానికి చెందిన...