భూముల సర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ చిత్రా మిశ్రా
భూముల సర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్, జూలై 10(ప్రజాక్షేత్రం):జిల్లాలో భూముల సర్వే, రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సాదా బైనామా–భూభారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి అంశంలో అధికారులు పక్కా ప్రణాళికతో పనిచేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూముల సర్వే, రీ-సర్వే, భూభారతి–సాదా...