prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 2:22 am Digital Edition : PRAJA KSHETRAM

30 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనం

రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనం

  • ప్రారంభించిన ఈ ఎల్ వి భాస్కర్

సంస్థాన్ నారాయణపురం జులై 04(ప్రజాక్షేత్రం):అల్లందేవిచెర్వు గ్రామంలో ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఈరోజు ఫౌండేషన్ చైర్మన్ డా. ఈ.ఎల్.వి. భాస్కర్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సమయంలో అల్లందేవిచెర్వు గ్రామాన్ని సందర్శించిన డా.ఈ.ఎల్.వి. భాస్కర్ కి గ్రామ సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ ప్రభుత్వ పాఠశాల ఒకే గదిలో కొనసాగుతోందని వివరించారు. దీనికి స్పందించిన భాస్కర్, సుర్వి సౌజన్య రాజు గౌడ్ సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామానికి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి అందజేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు సుర్వి సౌజన్య రాజు గౌడ్ సర్పంచ్‌గా ఎన్నికైన వెంటనే శంకుస్థాపన చేసి,కేవలం ఆరు నెలల వ్యవధిలోనే నాలుగు తరగతి గదులతో కూడిన ఆధునిక పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అంకితం చేశారు. అనంతరం డా. ఈ.ఎల్.వి. భాస్కర్, గ్రామ సర్పంచ్ శ్రీ సుర్వి సౌజన్య రాజు గౌడ్ , మండల విద్యాధికారి శ్రీ గోలి శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు శ్రీ కనక శీను, చైర్మన్ సుర్వి అలివేలు నగేష్ గౌడ్, ఉపసర్పంచ్ ముక్కర్ల కవితా స్వామి యాదవ్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వంటల సువర్ణ గణేష్ యాదవ్, సుర్వి కృష్ణవేణి నరేష్ గౌడ్, సుర్వి వినోద్ గౌడ్, సుర్వి లింగస్వామి గౌడ్, గుండు లింగస్వామి గౌడ్, అంతటి శివశంకర్ గౌడ్, గోధుమ గడ్డ భవాని లింగారెడ్డి సంయుక్తంగా నాలుగు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. ఎల్.వి. భాస్కర్ మాట్లాడుతూ, “విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, ప్రతి నెల జరిగే పేరెంట్–టీచర్ సమావేశాలకు హాజరై వారి విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి” అని పిలుపునిచ్చారు. అలాగే భవిష్యత్తులో ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బూడిద నందా రెడ్డి,చిల్లాపురం సర్పంచ్ రామ నర్సయ్య, అంకిరెడ్డి గూడెం సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్, అల్లాపురం సర్పంచ్ టేకుల మంజులా రెడ్డి,రెడ్డి భావి సర్పంచ్ నందగిరి వెంకటేష్ గౌడ్, మందోల్లగూడం సర్పంచ్ తంగెళ్ల వెంకటేష్, చౌటుప్పల్ 16వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, గతంలో అల్లందేవిచెర్వు పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు పిట్టల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ సుర్వి యాదయ్య గౌడ్, స్కూల్ టీచర్లు పుణ్యవతి, ప్రియాంక, బిజెపి నాయకులు అంతటి సురేష్ గౌడ్, సుర్వి సురేష్ గౌడ్, వంటల గణేష్ యాదవ్, గోధుమ గడ్డ జంగారెడ్డి, సుర్వి లింగస్వామి గౌడ్ సుర్వి వెంకటేష్ గౌడ్, ఎలిమినేటి రాజేందర్ రెడ్డి, వంటల లింగస్వామి యాదవ్, దోనూరు భాస్కర్ రెడ్డి, వంటల లింగస్వామి యాదవ్, ఎలిమినేటి శ్రీనివాస్ రెడ్డి, నోముల జనార్దన్ రెడ్డి, దోనూరు లింగారెడ్డి, ఏర్పుల రాజేష్, పగిళ్ల స్వామి, ఏర్పుల సురేష్, గ్రామపంచాయతీ సిబ్బంది ఏర్పుల నాగేష్ , ఏర్పుల గాలయ్య, ముఖ్యఅర్ల బిక్షపతి, కారోబార్ అంతటి నాగరాజు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మండల అధికారులు, వివిధ గ్రామాల ఉపసర్పంచులు,ప్రజాప్రతినిధులు, ఈ ఎల్ వి ఫౌండేషన్ టీం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.