ఇందుర్తిలో పోచమ్మ బోనాల వైభవం విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా బోనాల మహోత్సవం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం.. డప్పు చప్పుళ్లతో ఊరేగింపు.. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన ఇందుర్తి చిగురుమామిడి, జూలై 19 (ప్రజాక్షేత్రం) : ఇందుర్తి గ్రామంలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పోచమ్మ బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించగా, డప్పు చప్పుళ్లు, భక్తి గీతాల...