భద్రాచలం,జూలై20:(ప్రజాక్షేత్రం):
చర్ల మండల బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ప్రాతినిధ్యం మేరకు చర్ల మండల ప్రజలు నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలియజేయడంతో ఎంపి రవిచంద్ర వారి ప్రత్యేక నిధుల తో చర్ల మండలంలోని 8 చేతి పంపులు మంజూరు చేసారు. గత నెలలో కుదునూరు, ఆర్ కొత్తగూడెం, కలివేరు, తిప్పాపురం, పాత చర్ల, లింగాపురం పాడు, రాళ్ళగూడెంలో గ్రామాల్లో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి బోర్లను వేయించడం జరిగింది. ఈరోజు అన్ని బోర్లుకు మిగిలిన సామాగ్రి బిగించడం వలన అన్ని బోర్ పంపులు నీరు పుష్కలంగా ధారాళం నీరు రావడంతో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ఎంపి రవిచంద్ర గారికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేసారు. భద్రాచలం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఉన్న ప్రజల నీళ్ల సమస్య కాని రోడ్ల సమస్యలు కాని పట్టించుకోవడం లేదని అధికారంలో లేక పోయినా బిఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్గర ఉండి 200 అడుగుల వరకు బోర్లు వేయించినందుకు ఆర్ కొత్తగూడెం యసి కాలని ప్రజలు కూరపాటి వీర్రాజు అనేక సంవత్సరాలుగా ఉన్న నీళ్ల బాధ తీర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ పంచాయతీ నుండి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా నీళ్లు ఇబ్బంది ఉన్న పంచాయతీలకు రెండవ సారి అవకాశం కల్పిస్తాము అని తాతారావు తెలిపారు.