prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:22 pm Digital Edition : PRAJA KSHETRAM

అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ ను భగ్నం చేసిన పోలీసులు

అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ ను భగ్నం చేసిన పోలీసులు

  • గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు రిమాండ్ కు తరలింపు
  • 8.86కిలోల గంజాయి స్వాధీనం
  • ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్

కోటగిరి, ఆగస్టు 12(ప్రజాక్షేత్రం):అంతరాష్ట్ర గంజాయి రాకెట్ ను కోటగిరి పోలీసులు భగ్నం చేశారు. ఒడిశా నుండి గంజాయి తీసుకువచ్చి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. బోధన్ ఏసిపి శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు…పోతంగల్ చెక్ పోస్ట్ నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కోటగిరి పోలీసులు పోతంగల్ మంజీర నది మొదటి బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నడుచుకుంటూ ఒక సంచితో అనుమాన స్పదముగా కనిపించడముతో పోలీసులు అతనిని పట్టుకొనే ప్రయత్నం చేయగా పారిపోతుంటే వెంబడించి అతనిని పట్టుకొని అతని వద్ద ఉన్న సంచిని చెక్ చేయగా ఆ సంచిలో మొత్తం 8.86 కిలోల గంజాయి దొరికింది. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం పోచారం తాండా కు చెందిన బర్దల్ పాచిరం గా గుర్తించారు. పాచీరం ఇటీవల ఇల్లు కట్టడం వలన అప్పులు ఎక్కువ కావడంతో తక్కువ సమయములో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో రామ్ దాస్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని అతని ద్వారా ఒడిస్సా కి చెందిన చోటు అనే వ్యక్తి వద్దనుండి గంజాయిని తీసుకు వచ్చి స్థానికంగా అమ్మే వాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం చోటు కి గంజాయి కావాలని పాచిరం అడుగగా 75 రోజుల క్రితం కామారెడ్డి కి చోటు 10 కిలోల గంజాయి తీసుకు వచ్చాడు. ఆ గంజాయిని పాచిరాం తనకు తెలిసిన మహారాష్ట్ర దేగ్లూర్ చెందిన సాథికి అమ్మడానికి మంగళవారం పోతంగల్ రాగా అతనిని పోలీసులు పట్టుకొని అతని వద్ద నుండి 8.86 కిలోల గంజాయి ఒక సెల్ ఫోన్ స్వాధీనపర్చుకున్నారు. ఇందులో రామ్ దాస్, సాథి ఇతనికి గంజాయి సప్లైచేసిన చోటు లు ప్రస్తుతం పరారిలో ఉన్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిపి శ్రీనివాస్ తెలిపారు. గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన శిక్షణల కింద కేసులు నమోదు చేయబడతాయని అవసరమైతే పీడియాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తుకు సహకరించిన ఏసీపీ సీసీఎస్ శ్రీశైలం, ఎసిపి బోధన్ పి. శ్రీనివాస్, రుద్రూరు సిఐ కృష్ణ కోటగిరి యస్ఐ శ్రీనివాస్, రుద్రూర్ యస్ఐ మనోజ్, సిసియస్, యస్ఐ శ్రీనివాస్ మరియు ఈగల్ టీం, చీత ఫోర్స్ సిబ్బందినకి నిజామాబాద్ సిపీ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. గంజాయి వంటి నిషేదిత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అమ్మినా సరఫరా చేసినా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. గంజాయి మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారము ఎవరి వద్ద అయినా ఉంటే పోలీస్ వారికి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో కోటగిరి ఎస్సై శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారు.