prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 7:52 am Digital Edition : PRAJA KSHETRAM

అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి వేడుక

అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి వేడుక

  • రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న కు రాఖీ కట్టిన చెల్లెలు విజయ

వనపర్తి, ఆగస్ట్ 28(ప్రజాక్షేత్రం):రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి ఆయన సోదరి విజయ పద్మనాభరెడ్డి ఆత్మీయంగా రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఈ ఆత్మీయ కార్యక్రమం జరిగింది.
ప్రతి ఏడాది రాఖీ పండుగను అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకొనే విజయలక్ష్మి.. ఈసారి కూడా సోదరుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న అన్నాచెల్లెళ్ల ఆప్యాయత, ఆత్మీయతకు రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రతీకగా నిలిచాయి. రాఖీ కట్టిన అనంతరం విజయలక్ష్మి పద్మనాభరెడ్డి తన సోదరుడికి ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధం ప్రత్యేకమైనదని, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే ఈ బంధం గొప్పతనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్‌రెడ్డి తన సోదరి విజయలక్ష్మి పద్మనాభరెడ్డిని ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఆమెకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలను మరింత బలపరిచే పవిత్రమైన సందర్భమని తెలిపారు.

అన్నకు చెల్లెలి రాఖీ.. చెల్లెలికి అన్న ఆశీస్సులు

రాఖీ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఆత్మీయ కలయిక కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, పరస్పర నమ్మకానికి ఈ వేడుక ప్రతీకగా నిలిచింది.