prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 5:10 pm Digital Edition : mohan.sabbasani@gmail.com

అర్బన్‌ మేడ్చల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గిరివర్ధన్‌రెడ్డికి ఘన సన్మానం

అర్బన్‌ మేడ్చల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గిరివర్ధన్‌రెడ్డికి ఘన సన్మానం

కాప్రా, ఆగస్టు 23(ప్రజా క్షేత్రం): అర్బన్‌ మేడ్చల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన గిరివర్ధన్‌రెడ్డిని కాప్రా బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో గిరివర్ధన్‌రెడ్డి విజయవంతంగా రాణించి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని నాయకులు కోరారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు రానున్న రోజుల్లో కాప్రా ప్రాంతంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ బీజేపీ నాయకులు అంబిక, విజయ్‌, వినోద్‌, నిశాంత్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.