prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 1:43 pm Digital Edition : PRAJA KSHETRAM

ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు

శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు

చౌటుప్పల్ ఆగస్టు 02(ప్రజాక్షేత్రం):ఆదివారం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం నందు లో అమ్మవారు 21వ బోనాల ఉత్సవంలో ఘనంగా జరిగినాయి ఈరోజు ఉత్సవంలో భాగంగా చండీ హోమం బోనాలు శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహం గ్రామ సేవ రథోత్సవం ఘనంగా జరిగినది బోనాల ఉత్సవంలో భాగంగా అమ్మవారి కు ఈరోజు సర్కార్ బోనం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విని రెడ్డి మరియు కార్యనిర్వాహణాధికారి సల్వాది మోహన్ బాబు అమ్మవార్కు బోనాలు నైవేద్యం సమర్పించడమైనది ఆందోల్ మైసమ్మ దేవాలయం హైదరాబాద్ దగ్గర ఉండటం వలన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు మరియు ఒడిబియ్యం సమర్పించడం జరిగినది అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం చేయడం జరిగినది భక్తులకు అన్నదాన కార్యక్రమం దాత కొమిరిశెట్టి విజయ్ కుమార్ శిరీష దంపతులు ఏర్పాటు చేశారుమైసమ్మ దేవస్థానం నందు భక్తులు అధికంగా రావడం వలన చౌటుప్పల్ ట్రాఫిక్ సిఐ నందగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చేసి భక్తులను వరుస క్రమంలో లైన్లో ద్వారా అమ్మవారి దర్శనం అయ్యేటట్టు కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీట్కాటి నిరంజన్ మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్ చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్ పన్నాల, మహేందర్ రెడ్డి, ధేప రాజీవ,పంతంగి రమేష్, జొన్నగంటి దాసు,చిట్టెంపల్లి సబిత, వల్లూరి శివప్రసాద్ శర్మ మరియు గ్రామ ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.