prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 9:26 am Digital Edition : PRAJA KSHETRAM

ఎరువుల డీలర్లపై టాస్క్‌ఫోర్స్ కొరడా

ఎరువుల డీలర్లపై టాస్క్‌ఫోర్స్ కొరడా

  • పెద్దేముల్ మండలంలో డీలర్లకు అధికారుల హెచ్చరిక
  • స్టాక్, రికార్డులపై క్షుణ్ణంగా పరిశీలన
  • రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల సరఫరాపై పర్యవేక్షణ

– రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

  • తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ అరుణ

పెద్దేముల్,ఆగస్టు 18 (ప్రజా క్షేత్రం )

ఎరువుల డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ అరుణ సూచించారు.రైతులకు ఎరువుల కొరత లేకుండా, విక్రయాలు నిబంధనల ప్రకారం జరిగేలా మంగళవారం పెద్దేముల్ మండలంలోని ఎరువుల డీలర్ దుకాణాల్లో వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా డీలర్ దుకాణాల్లోని ఎరువుల నిల్వలను అధికారులు పరిశీలించారు.స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ వివరాలు, ధరల పట్టికలు, నేమ్ బోర్డులు, ఇతర సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న ఎరువుల నిల్వలు రికార్డుల్లో నమోదైన వివరాలతో సరిపోలుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. ఎరువుల విక్రయాలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా అనే దానిపై కూడా అధికారులు ఆరా తీశారు.ఈ సందర్భంగా తాండూర్ అగ్రికల్చర్ ఏడీఏ అరుణ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఎరువుల డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దుకాణాల్లో ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలు సక్రమంగా నిర్వహించాలని, రైతులకు నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని స్పష్టం చేశారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం లేదా కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు తప్పనిసరిగా స్టాక్, ధరలు తదితర వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల విక్రయాలు పారదర్శకంగా జరిగేలా టాస్క్‌ఫోర్స్ తనిఖీలు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి పి.పవన్ ప్రీతమ్,పెద్దేముల్ మండల తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్, ఎంపీడీఓ కె.తిరుమల స్వామి, ఎరువుల డీలర్ల దుకాణాల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.