కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి బూర్గంపాడు ఆగస్టు 17 (ప్రజాక్షేత్రం):పేద ఆడబిడ్డల వివాహాలకు భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత నేతృత్వంలో సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.అనంతరం సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా...