prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 3:52 am Digital Edition : PRAJA KSHETRAM

కల్లూరు శివారులో కారు ప్రమాదం

కల్లూరు శివారులో కారు ప్రమాదం

  • ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడంతో తప్పిన పెను ప్రమాదం
  • క్షతఘాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించిన స్థానికులు

కోటగిరి ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):కోటగిరి మండలం లోని కల్లూరు గ్రామ శివారులో శుక్రవారం కారు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కల్లూరు గ్రామ శివారులో బీర్కూర్ నుండి పోతంగల్ వైపు వచ్చే మెయిన్ రోడ్ పై కల్లూరు బస్టాండ్ దగ్గర ఉన్న మూలమలుపు వద్ద బీర్కూరు నుండి పోతంగల్ వైపు వెళ్తున్న మారుతి సుజుకి ఎర్టిగా కారు అదుపు తప్పడంతో చెట్టు ఢీకొంది. ఘటన జరిగిన సమయంలో కారులో డ్రైవర్ సహా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు గాయాలయి అపరస్మారక స్థితిలోకి వెళ్ళగా వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు అంబులెన్స్ కు కాల్ చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కల్లూరు గ్రామ సర్పంచ్ రామిరెడ్డి, గౌడ సంఘం నాయకులు రామా గౌడ్ ఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు. కాగా ప్రమాదానికి గురైన కారు బిచ్కుంద గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు.