prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 4:22 am Digital Edition : PRAJA KSHETRAM

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నూతన గ్రామ కమిటీల ఏర్పాటు

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నూతన గ్రామ కమిటీల ఏర్పాటు

  • పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మహిపాల్ రెడ్డి

పెద్దేముల్, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని పెద్దేముల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి, రుక్మాపూర్, రేగొండి,కొండాపూర్, మదనంతాపూర్, మన్ సాన్ పల్లి, మారేపల్లి తండా, దుగ్గాపూర్, చైతన్యనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సూచనలు,తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ ఆదేశాలతో మండలంలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీలు, బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల వారీగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ గ్రామ కమిటీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బీఎల్ఏలు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీలు కీలకంగా పనిచేయాలని నాయకులు సూచించారు.ఈ మేరకు రుక్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సురేందర్,రేగొండి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్, కొండాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్.శివ కుమార్, మదనంతా పూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చవాన్ రాజు, మన్ సాన్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మూడవత్ జై రాం,మారేపల్లి తండా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బానావత్ చందర్,దుగ్గాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోయిని అంజిలప్ప, చైతన్య నగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుక్కల హన్మంతు లను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఈ సందర్భంగా పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ……. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీల ఏర్పాటులో యువత, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి కార్యకర్తకు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని మహిపాల్ రెడ్డి సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారాయణ గౌడ్,ఆయా గ్రామాల సర్పంచులు భూమే యాదమ్మ,బాల్ రాజ్, అశోక్, గోపి నాయక్,హేమీ బాయి,మంగమ్మ,ఎం.గౌరమ్మ,మంబాపూర్ మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.నసీరొద్దీన్,మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.ఎల్లా రెడ్డి,టీపీసీసీ మైనారిటీ కన్వీనర్ ఎండీ.రియాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి,కే.గోపాల కృష్ణ,మంబాపూర్ శ్రీనివాస్ రెడ్డి, తట్టేపల్లి జగన్, కే.నర్సింహులు, ఎండీ.మైఫూజ్, గాజీపూర్ లాల్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి,పీటర్ యాదయ్య,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.