కేబినెట్‌లో కదలికలు!
కేబినెట్‌లో కదలికలు! సెప్టెంబర్‌లో ప్రక్షాళనకు కసరత్తు.. సురేఖపై అధిష్ఠానం నిర్ణయం.. మహేశ్‌గౌడ్–రాజగోపాల్‌రెడ్డి పేర్లపై ఆసక్తి రేవంత్ ఢిల్లీ బాట.. భట్టి విక్రమార్క కర్ణాటక పర్యటనతో రాజకీయ లెక్కలకు కొత్త అర్థాలు! సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు పెద్దపీట.. కొత్త టీమ్‌తో పాలనకు మరింత బలం చేకూర్చే వ్యూహమా? వికారాబాద్ బ్యూరో ఆగస్టు 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి వేడి పుట్టిస్తోంది. కేబినెట్‌లో మార్పులు ఉంటాయా? కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తారా? ప్రస్తుత మంత్రుల్లో ఎవరి శాఖలు మారుతాయి? ఎవరికి ఉద్వాసన పలుకుతారు?...