ఘనంగా ఎన్నారై కోనేరు శశాంక్ బర్త్ డే వేడుకలు
- కస్తూర్బా గాంధీ పాఠశాలకు సీసీ కెమెరాలు ఇస్తానన్న కోనేరు శశాంక్
- 30 మందికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేత
- రాఖీ కట్టిన మహిళలకు చీరల పంపిణీ
- కోనేరు శశాంక్ కు రాఖీ కట్టిన కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు
కోటగిరి ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపు కు చెందిన కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,ప్రముఖ ఎన్నారై, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు కోనేరు శశాంక్ పుట్టినరోజు వేడుకలను కోటగిరి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బిజెపి శ్రేణులు అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లో కోనేరు శశాంక్ బర్త్ డే వేడుకలను బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం వర్గానికి చెందిన 30 మంది నిరుపేదలను ఎంపిక చేసి వారికి విద్య వైద్యం కొరకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న కొందరికి, కుటుంబంలో ఎలాంటి ఆధారం లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మరికొందరికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందజేశారు. రాఖి పండుగ సందర్భంగా కోనేరు శశాంక్ కు రాఖీ కట్టిన మహిళలకు చీరలను బహుమతిగా అందించారు. అనంతరం కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో కలిసి కోనేరు శశాంక్ రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయని అడగగా పది రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కస్తూర్బా విద్యార్థులకు కోనేరు శశాంక్ స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై కోనేరు శశాంక్ మాట్లాడుతూ…. తన పుట్టినరోజును కోటగిరి మండలంలో నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన మహిళలకు పండుగ కానుకగా చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు వైద్య ఖర్చులకోసం ఉన్నత విద్య కోసం ఒక్కొక్కరికి పదివేల చొప్పున 30 మందికి సహాయం చేసినట్టు చెప్పారు. కస్తూర్బా పాఠశాలలో రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొని విద్యార్థినులు రాఖీలు కట్టినందున వారికి బహుమానంగా పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని దీవించిన ఆడపడుచులకు, ఏర్పాట్లు నిర్వహించిన బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ…. ఈ రోజుల్లో పుట్టినరోజు వేడుకలు అంటే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకొని ఆర్బాటాలు చేసే నాయకులను చూశాం కానీ పేద ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వారికి అధికంగా అండగా నిలిచే కోనేరు శశాంక్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని పేద ప్రజల బాగుకోసం ఆలోచించి అందరికీ ఆర్థిక సహాయం చేయటం, రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం, కస్తూర్బా గాంధీ విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయించడం గొప్ప విషయం అన్నారు. కోనేరు శశాంక్ లాంటి మంచి మనసున్న నాయకుల కు ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్షుని ప్రసాదించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని రాజకీయ రంగంలో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున కోనేరు శశాంక్ కు ధన్యవాదాలు తెలియజేశారు.అంబం సర్పంచ్ కుర్లెపు గంగాధర్,ఉపసర్పంచ్ రేపల్లె సాయిప్రసాద్,జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు,జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ సాయిరెడ్డి,చందూర్ మాజీ ఎంపీటీసీ నర్సింహులు,బాన్సవాడ రూరల్ అధ్యక్షుడు శ్రీను, కోటగిరి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఏముల నవీన్, రుద్రూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు హరికృష్ణ, సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు, మహిళా మోర్చా నాయకురాలు శ్యామల కులకర్ణి, మామిడి శ్రీనివాస్, మామిడి రవి, మామిడి సాయిలు, ఓమన్న పటేల్, ప్రకాష్ పటేల్, దావులయ్య, నాగేల్లి శ్రీనివాస్, వడ్ల శ్యామ్, పబ్బా శేఖర్, విలాస్, జగదీష్, శ్యామ్, శివశంకర్, సీతారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.